మేకపాటి నా వెంటపడ్డారు.. తీసుకెళ్లి బెంగుళూరులో కాపురం పెట్టాడు… లక్ష్మీదేవి
నెల్లూరు : నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప మరెవరూ లేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై శివచరణ్ రెడ్డి తల్లి, మేకపాటి రెండో భార్యగా చెప్పుకునే లక్ష్మీదేవి వివరణ ఇచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ తనతో 18 యేళ్లు కాపురం చేశారని, అలా పుట్టిన బిడ్డే శివచరణ్ రెడ్డి అని తెలిపారు.
తనకు 15 యేళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని, అయితే, తనకు ఇష్టం లేకపోవడంతో ఆ తర్వాత రెండేళ్లకే వదిలేసి వెళ్లిపోయారని గుర్తు చేసారు. దీంతో తాను తన పిన్ని ఇంట్లో ఉంటూ వచ్చానని తెలిపారు. ఆ తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనను ఇంటికి తీసుకెళ్తాని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్ళపాటుతన ఇంటి చుట్టూ తిరిగాడని చెప్పారు. ఇపుడేమో డబ్బుల కోసం అబద్ధాలు ఆడుతున్నామని అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తనను తీసుకెళ్లి బెంగుళూరులో కాపురం పెట్టాడని, అక్కడ శివచరణ్ రెడ్డిని చక్కగా చూసుకునే వారని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయనతో ఉన్న శాంతకుమారి పరిచయం కావడంతో ఇంటికి రావడం తగ్గించారని, ఈ విషయం తెలిసి తాను నిలదీసిన తర్వాత పూర్తిగా రావడం మానేశారని చెప్పారు. అప్పటి నుంచి తమను కష్టాలు వెంటాడుతున్నాయని లక్ష్మీదేవి బోరున విలపిస్తూ వివరించారు.