ఏపీ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా!!!
శక్తి టీవీ, అమరావతి :-
ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే.