ఆంధ్రప్రదేశ్

వ్యాపారస్తులు గుడ్డ సంచులను ప్రోత్సహించాలి

ఉత్తర విశాఖ : నగరంలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తున్నామని అందుకు సంబంధించి వ్యాపారస్తులు సైతం గుడ్డ సంచులను మాత్రమే వినియోగించే విధంగా వినియోగ దారులను ప్రోత్సహించాలని జీవీఎంసీ జోన్ -5 కమిషనర్ ఆర్ జి వి కృష్ణ పేర్కొన్నారు.

ఈమేరకు మర్రిపాలెం రైతు బజార్ లో మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా సింగల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ జివిఎంసి అధికారులతో పాటుగా సచివాలయ సిబ్బంది విస్తృత ప్రచారం చేపట్టాలని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం పై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా నిత్యం సచివాలయ సిబ్బంది ని సమన్వయ పరుస్తూ ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలు స్పందిస్తున్నారని చాలా ప్రాంతాల్లో ప్రజలు గుడ్డ సంచులను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. ఎం. హెచ్. ఓ ఏ. రాజేష్, సచివాలయ సిబ్బంది, మలేరియా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply