తెలంగాణ

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం

సిద్దిపేట : కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుండి రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చేసిన ప్రకటనపై కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల నాయకులతో సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల సేవను గుర్తించి 12 నెలల వేతనం, బేసిక్ పే ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు నిరుద్యోగుల పేరుతో వేసిన కేసులను కొట్టివేయడంతో నేడు రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. ఆయనతో పాటు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాల నాయకులు కొండల్, త్రిభువనేశ్వర్, అరుణ్కు మార్, శ్రీనివాస్ రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ తదితరులున్నారు.

Leave a Reply